Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్

బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్

V6 Velugu 1 hr ago

బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి్ కుప్పకూలింది.జలాల్ పూర్ ప్రాంతంలో NHAI నిర్మిస్తున్న హైవే వంతెనలోని కొంత భాగం కూలిపోయింది.

కాంక్రీట్ స్లాబ్, బీమ్ లాంచర్ కూలిపోయి కూలీలపై పడ్డాయి.. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

గురువారం (సెప్టెంబర్ 10) మధ్యాహ్నం వైశాలి జిల్లా జలాల్ పూర్ ప్రాంతంలోని లాల్ గంజ్ లో ఈ ఘటన జరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మిస్తున్న NH-139W నాలుగు లేన్ల హైవే ప్రాజెక్టులో పనుల జరుగుతుండగా ..నిర్మాణ సామాగ్రి , ఉక్కు భాగాలు ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద పడి ఎనిమిది మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. భారత్‌మాల పథకం కింద లాల్‌గంజ్ ప్రాంతంలో NHAI బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతుండగా ఈ ఘటన జరిగింది.

ALSO READ : హైదరాబాద్లో సిటీ బస్సు బీభత్సం..

బరువైన ఇనుప నిర్మాణం కింద ఓ కార్మికుడు చిక్కుకుపోయాడు. అతని కాలు ఇనుప భీంల కింద నలిగిపోయింది. సహాయక చర్యలు జరుగుతుండగా, ఉపశమనం కలిగించే ప్రయత్నంలో స్థానికులు అతని తలపై నీళ్ళు పోస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇనుప భీంలను కట్ చేసి చివరకు అతన్ని బయటికి తీశారు.

చికిత్స కోసం సమీప ఆస్పత్రలుకు తరలించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News