Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా?: ఈరవత్రి అనిల్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా?: ఈరవత్రి అనిల్

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్, వెలుగు: దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజురీయింబర్స్​మెంట్​ అమలు చేస్తున్నారా అని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు. బుధవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడుతూ..

మధ్యప్రదేశ్​లో విద్యార్థుల స్కాలర్‌షిప్​లు బకాయిలు ఉన్నాయి.. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా.. బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్ రావు అక్కడకెళ్లి దీక్ష చేస్తే బాగుంటుందన్నారు.

ఉత్తరప్రదేశ్​లో 11 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, అక్కడ ఒక్క ఏడాదిలోనే 25 వేల స్కూళ్లు మూతపడ్డాయని అక్కడ కూడా ఆయన దీక్ష చేస్తే బాగుంటుందన్నారు. ఏపీలో రూ.7,800 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, అక్కడ మీ మిత్రులే అధికారంలో ఉన్నందున అక్కడికి వెళ్లి దీక్ష చేయాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News