Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నామనడం అబద్ధం..బీసీలకు కాంగ్రెస్ ఇచ్చే ప్రయారిటీ మరే పార్టీ ఇవ్వదు

బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నామనడం అబద్ధం..బీసీలకు కాంగ్రెస్ ఇచ్చే ప్రయారిటీ మరే పార్టీ ఇవ్వదు

V6 Velugu 2 weeks ago
  • పార్టీ నియమావళి ప్రకారమే క్రమశిక్షణ చర్యలు : టీపీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

నిజామాబాద్, వెలుగు : బీసీ నేతలను కాంగ్రెస్ టార్గెట్​చేస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​అన్నారు.

రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ కాంగ్రెస్​ఒక్కటేనన్నారు.

గురువారం నిజామాబాద్​లో మీడియాతో మాట్లాడారు. తమకు ఎవరిపైనా కోపతాపాలు, కక్షలు లేవని, పార్టీ నియమావళిని గౌరవిస్తూ అందరూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ పూర్తిగా స్టడీ చేసి ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ మీనాక్షీ నటరాజన్​ ద్వారా ఏఐసీసీకి పంపామన్నారు.

ఏఐసీసీ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది తాను చెప్పలేనని, కానీ నిర్ణయం ఎలా ఉన్నా అందరూ ఆమోదించవలసిందేని చెప్పారు. కొండా సుస్మిత వివాదాస్పద కామెంట్స్​తర్వాత కొండా మురళి తనను కలవలేదని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసినట్టు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి బీసీ లెక్కలు తేల్చామని, రిపోర్టను కేంద్రానికి పంపితే ఏ నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టారని విమర్శించారు.

నీటి వాటాల గురించి అర్థం పర్థం లేని అపోహలు సృష్టించడానికి హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీపడబోమన్నారు. ఆయన వెంట డీసీసీ ప్రెసిడెంట్​నగేశ్​రెడ్డి ఉన్నారు. అంతకు ముందు తల్లి చనిపోయి బాధలో ఉన్న మేయర్​ఉమారాణిని పరామర్శించారు. సర్ లో భాగంగా అందిన నోటీసుకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News