Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీసీసీఐ కీలక భేటీ.. రోహిత్ కెరీర్‌పై బిగ్ కాల్? గంభీర్, అగార్కర్‌తో గిల్- శ్రేయస్ మీటింగ్!

బీసీసీఐ కీలక భేటీ.. రోహిత్ కెరీర్‌పై బిగ్ కాల్? గంభీర్, అగార్కర్‌తో గిల్- శ్రేయస్ మీటింగ్!

V6 Velugu 3 days ago

BCCI Review Meeting: ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈరోజు (సెప్టెంబర్ 3న, గురువారం) కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను కూడా బోర్డు ప్రత్యేకంగా ఆహ్వానించింది.

గిల్ నేరుగా హాజరుకానుండగా, శ్రేయస్ అయ్యర్ వర్చువల్‌గా లేదా నేరుగా పాల్గొననున్నారు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో ఎదురైన పరాజయాలు, శ్రీలంకతో టెస్టు సిరీస్ ఫలితాలపై ఈ భేటీలో లోతుగా చర్చ జరపనున్నారు.

రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్లేనా?:

ఈ సమావేశంలో అందరి దృష్టి రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌పైనే నెలకొంది. 39 ఏళ్ల వయసున్న రోహిత్‌ను 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో కొనసాగించాలా వద్దా అనే అంశంపై బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్ల మధ్య తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వన్డేలో అద్భుత శతకం సాధించినప్పటికీ, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్ టాలెంట్ రేసులో ఉండటంతో రోహిత్ భవిష్యత్తుపై టీమ్ మేనేజ్‌మెంట్ క్లారిటీ కోరుతోంది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా గతంలో రోహిత్‌కు మద్దతుగా మాట్లాడినప్పటికీ, ఈ మీటింగ్‌లో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

ఫిట్‌నెస్, ప్లేయర్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్:

వరుస పరాజయాలతో పాటు జట్టులో పెరుగుతున్న గాయాలు, ఫిట్‌నెస్ లోపాలు కూడా ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశంగా మారనున్నాయి. ప్రధాన ఆటగాళ్లు తరచూ గాయపడటం, రీహాబిలిటేషన్ తర్వాత మైదానంలోకి దిగిన తర్వాత మళ్లీ సమస్యలు ఎదుర్కోవడంపై బోర్డు సీరియస్‌గా ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్ల లభ్యతతో పాటు ఐపీఎల్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై CoE హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో గంభీర్, అగార్కర్ చర్చించనున్నారు. రాబోయే సుదీర్ఘ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై కఠిన మార్గదర్శకాలు విధించే యోచనలో బోర్డు ఉంది.

ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ సిరీస్‌లకు రోడ్‌మ్యాప్:

సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభం కానున్న 3 టీ20ల సిరీస్‌తో పాటు, ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌కు సంబంధించి టీమ్ సెలెక్షన్ రోడ్‌మ్యాప్‌ను ఈ భేటీలోనే ఖరారు చేయనున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్, WTC సైకిల్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వాలా లేదా సీనియర్లతోనే ముందుకు వెళ్లాలా అనేదానిపై ఈ సమావేశంలో తేల్చేయనున్నారు. ఈ మీటిం ముగిసిన తర్వాత భారత క్రికెట్ రాబోయే దిశ, జట్టు భవిష్యత్తుపై ఒక క్లారిటీ రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News