Dailyhunt
బీటెక్ స్టూడెంట్ను పెళ్లి చేసుకున్న ఐఐటీ బాబా.. ఎవరీ ప్రతీక..?

బీటెక్ స్టూడెంట్ను పెళ్లి చేసుకున్న ఐఐటీ బాబా.. ఎవరీ ప్రతీక..?

V6 Velugu 2 weeks ago

కుంభమేళా-2025 సమయంలో ఐఐటీ బాబా అనే పేరు ఎంత వైరల్ అయ్యిందో గుర్తుంది కదా. ఐఐటీలో చదివి.. లక్షల జీతం ఇచ్చే కార్పోరేట్ కంపెనీలను కాదని.. బాబా అవతారం ఎత్తిన అభయ్ సింగ్ అప్పట్లో సెన్సేషన్.

ఇప్పుడు ఆయన గురించి అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగ జీవితం నుంచి సన్యాసం వైపు వెళ్లిన బాబా.. లేటెస్టుగా సంసార జీవితం వైపు రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్ మహాశివరాత్రి రోజు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రతీక అనే బీటెక్ స్టూడెంట్ ను పెళ్లి చేసుకోవడంతో.. ఎవరీ అమ్మాయి అని తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఎవరీ ప్రతీక..?

ప్రతీక కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని. మహాకుంభ మేళా తర్వాత సద్గురు ఆదియోగి ఆశ్రయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2026 ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా అఘంజార్ మహదేవ్ ఆలయంలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 19న రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయ్యింది.

మార్చి 6న కుటుంబ సభ్యులను కలిసేందుకు ఝజ్జర్ వెళ్లారు. అదే సమయంలో బ్యాంకు పనిమీద వెళ్లినప్పుడు జనాలు గుమిగూడి ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాంకు డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తుండటం, పేరెంట్స్ తో టైమ్ స్పెండ్ చేయడం వంటి వీడియో క్లిప్స్ వైరల్ గా మారాయి.

బాబా గురించి ప్రతీక మాటల్లో..

ఐఐటీ బాబాగా ప్రాచుర్యంలో ఉన్న తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది ప్రతీక. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అని నిజాయతీగా తనపని తాను చేసుకుంటూ పోయే మనస్థత్వం అయినందునే పెళ్లికి ఒప్పుకున్నట్లు ప్రీతక వెల్లడించింది. ప్రజలకు ఆధ్యాత్మక బోధ చేసేందుకు ప్రస్తుతం శ్రీ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నట్లు అజయ్ చెప్పారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుు కావాల్సిన పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు.

ఎవరీ ఐఐటీ బాబా..?

హర్యానా రాష్ట్రానికి చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివాడు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్‎మెంట్‎లో భారీ ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. కొంత కాలం పాటు ఉద్యోగం చేసిన అభయ్ సింగ్.. జాబ్‎పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో లక్షల జీతాన్ని వదులుకుని తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ వైపు వెళ్లాడు. ఫొటోగ్రఫీ చేస్తోన్న సమయంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు అభయ్ సింగ్. దీంతో లక్షల వచ్చే జాబ్, ఇష్టమైన ఫొటోగ్రఫీని వదిలేసి.. సన్యాసం స్వీకరించి బాబాగా మారాడు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‎‎లోని ప్రయాగ్ రాజ్‎లో మహా కుంభమేళాకు వెళ్లాడు అభయ్ సింగ్.

పూర్తిగా కాషాయ దుస్తుల్లో ఉండి ఫ్లూయెంట్‎గా పలు భాషాలు మాట్లాడుతున్న అభయ్ సింగ్.. ఓ మీడియా ఛానెల్ కంటపడ్డాడు. ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక క్యాంపస్‎లో చదవి.. సన్యాసం వైపు అడుగులేయడానికి కారణమేంటని న్యూస్ ఛానెల్ ఐఐటీ బాబా స్టోరీని తెలుసుకుంది.

ఈ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అభయసింగ్ అలియాస్ ఐఐటీ బాబా లైమ్ లైట్‏లోకి వచ్చారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు ఐఐటీ బాబా. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్, ఇండియా తలపడే మ్యాచులో టీమిండియా ఓటమి పాలువుతుందని మ్యాచ్‎కు ముందు ఐఐటీ బాబా జోస్యం చెప్పాడు.

కానీ ఐఐటీ బాబా జ్యోతిష్యం బూమరాంగ్ అయ్యింది. దాయాది పాకిస్థాన్‎ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో ఐఐటీ బాబాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ ఓటమి పాలవుతుందని కామెంట్స్ చేసిన నేపథ్యంలోనే ఐఐటీ బాబాపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై అతడు ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. భారత్ గెలవదని చెప్పాను కానీ టీమిండియానే గెలుస్తుందని నా మనసుకు తెలుసంటూప్లేట్ ఫిరాయించాడు ఐఐటీ బాబా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News