Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొగత హోరు.. పర్యాటకుల జోరు.. ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన టూరెస్ట్లు

బొగత హోరు.. పర్యాటకుల జోరు.. ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన టూరెస్ట్లు

V6 Velugu 1 week ago

వెంకటాపురం, వెలుగు : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ అడవుల్లో వర్షాలు కురుస్తుండడంతో బొగత జలపాతం ఉప్పొంగుతోంది.

ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో సెల్ఫీలు దిగారు. మరికొందరు నీటిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు. కాగా, జలపాతం వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాజేడు ఫారెస్ట్ ఆఫీసర్ నరేందర్ సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News