బుడాపెస్ట్: ఇండియా స్క్వాష్ ప్లేయర్ వేలావన్ సెంథిల్‌కుమార్.. బుడాపెస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ 54వ ర్యాంకర్ సెంథిల్‌కుమార్ 11-4, 11-2, 11-3తో బాలాజ్ ఫర్కాస్ (హంగేరి)పై విజయం సాధించాడు.
పీఎస్‌ఏ కాపర్ స్థాయి టోర్నీలో సెంథిల్‌కు ఇదే తొలి టైటిల్ కాగా ఓవరాల్ కెరీర్‌లో 11వ పీఎస్‌ఏ టూర్ చాంపియన్‌షిప్. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సెంథిల్ అద్భుతంగా ఆడాడు. ప్రత్యర్థికి ఎక్కడా పుంజుకునే చాన్స్ ఇవ్వకుండా మూడు గేమ్‌ల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. 2024లోనూ ఫర్కాస్‌పై నెగ్గిన సెంథిల్ ముఖాముఖి రికార్డులో 3-0 ఆధిక్యంలో ఉన్నాడు. విజేతగా నిలిచిన సెంథిల్‌కు రూ. 51 లక్షల ప్రైజ్‌మనీ లభించింది.

