Dailyhunt
చెన్నైను తుక్కు తుక్కు కొట్టిండు: ఐపీఎల్‎లో తన రికార్డ్ తానే బద్దలుకొట్టిన కోహ్లీ

చెన్నైను తుక్కు తుక్కు కొట్టిండు: ఐపీఎల్‎లో తన రికార్డ్ తానే బద్దలుకొట్టిన కోహ్లీ

V6 Velugu 1 week ago

బెంగళూర్: రికార్డుల రారాజుగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‎లో ఒకే జట్టు (చెన్నైపై 1,174)పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‎గా రికార్డ్ సృష్టించాడు.

గతంలో కూడా ఈ రికార్డ్ కోహ్లీ పేరిటే ఉంది. పంజాబ్ కింగ్స్‌పై 1,159 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 19లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 5) చెన్నైతో జరిగిన మ్యాచులో 28 పరుగులు చేయడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేశాడు కోహ్లీ. ఐపీఎల్‎లో మోస్ట్ పాపులర్ టీముల్లో ఒకటైన చెన్నైపై చెలరేగి ఆడటంతో కోహ్లీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. చెన్నైను తుక్కు తుక్కు కొట్టిండు పో అంటూ ఇంటర్నెట్లో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు కోహ్లీ అభిమానులు.

►ALSO READ | Virat Kohli : కోహ్లీ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ డ్యాప్ చేసిన దూబే.. ఖలీల్ అహ్మద్ షాక్

ఇక, ఈ మ్యాచులో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‎కు దిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 18 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 28 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో సాల్ట్ (45), పడిక్కల్ (16) ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News