Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేతితో చెంపపై పెళ్లుపెళ్లున కొట్టుకున్న నటుడు.. హుషారు పిట్టలు ఈవెంట్లో ఊహించని పరిణామం !

చేతితో చెంపపై పెళ్లుపెళ్లున కొట్టుకున్న నటుడు.. హుషారు పిట్టలు ఈవెంట్లో ఊహించని పరిణామం !

V6 Velugu 1 week ago

హుషారు పిట్టలు సినిమా ఈవెంట్లో ఊహించని పరిణామం జరిగింది. నటుడు భాను ప్రవర్తనతో వేదికపై ఉన్న వాళ్లంతా షాకయ్యారు. పుట్టా భాను అనే నటుడు ఈవెంట్లో మాట్లాడుతున్న సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యాడు.

సినిమాలపై తనకు ఉన్న అమితాసక్తిని, నటుడిగా అవకాశం రావడానికి తాను పడిన ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ తాను ఇదంతా కలనా.. నిజమా అనే విషయం అర్థం కావడం లేదని చెప్పాడు. అంత పెద్ద స్క్రీన్ పైన తనను తాను చూసుకున్నానని.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని మాట్లాడుతూనే తన చేతితో చెంపలపై పెళ్లుపెళ్లున కొట్టుకున్నాడు.

అన్షు, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం 'హుషారు పిట్టలు'. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. 'టీజర్ రిలీజ్ తర్వాత సినిమాలో కంటెంట్ ఏమిటో తెలియక చాలామంది బ్యాడ్ కామెంట్లు పెట్టారు. అన్ని రకాల ఎమోషన్తో అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది' అని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News