Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ది మేజ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

ది మేజ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

V6 Velugu 1 week ago

మిళ, తెలుగు ప్రేక్ష కుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నహీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటి స్తున్న కొత్త సినిమా 'ది మేజ్'. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో డాక్టర్ ఉదయ్ రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.

రీసెంట్గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా, గురువారం ఈ చిత్రంలోని మొదటి పాటను హీరో ఆనంద్ దేవరకొండ విడుదల చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పాడు. శ్రవణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన పాటకు విజయ్ కుమార్ లిరిక్స్ రాయగా, కపిల్ కపిలన్ పాడాడు. 'నా ప్రాణం నీవే, నాధ్యానం నీవే, నా మౌన గానం ఇకపై నీవే, నా స్నేహం నీవే, నా మోహం నీవే. నా తీరని దాహం ఇకపై నీవే, నా లోకం నీవే మనసిచ్చావే..' అంటూ సాగిన పాటలో హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇదొక న్యూఏజ్ కమర్షియల్ థ్రిల్లర్ అని, ఆడియెన్సు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News