తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. 85 ఏళ్ళ వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం ( జూన్ 10 ) మరణించారు.
భారతీరాజా డైరెక్ట్ చేసిన సీతాకోకచిలుక సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డుతో పాటు ఆయనకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు తెచ్చి పెట్టింది.
భారతీరాజా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గ్రామీణ కథలకు కొత్త దిశ చూపుతూ.. పల్లె అందాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు భారతీరాజా.
భారతీరాజా కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ దగ్గర అసిస్టెంట్ గా చేరి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 16 వయిదనిలే అనే తమిళ్ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు భారతీరాజా.
దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆయన కెరీర్ లో 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారంతో పాటు అనేక గౌరవాలు అందుకున్నారు భారతీరాజా.

