Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దివ్యాంగుల సంక్షేమానికి టాప్ ప్రయారిటీ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

దివ్యాంగుల సంక్షేమానికి టాప్ ప్రయారిటీ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

V6 Velugu 4 days ago
  • డిజిటల్‌ లైబ్రరీ, పోటీ పరీక్షల కోచింగ్‌కు ప్రపోజల్స్
  • ట్రాన్స్‌జెండర్లకు వైద్యం, గుర్తింపు కార్డులు
  • సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

హైదరాబాద్, వెలుగు : దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. వీరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సోమవారం సచివటయంలో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, సీనియర్‌ సిటిజన్ల శాఖలపై మంత్రి లక్ష్మణ్‌ సమీక్ష చేపట్టారు. వివిధ శాఖల వారీగా అమలవుతున్న కార్యక్రమాలు, సంస్థల నిర్వహణ, మౌలిక వసతులు, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై మంత్రి ఆరా తీశారు. దివ్యాంగుల పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు.

రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు వేడి నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. దివ్యాంగుల పాఠశాలలు ఎన్ని ప్రభుత్వ భవనాలలో, ఎన్ని ప్రైవేటు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయనే సమగ్ర వివరాలు అందజేయాలని మంత్రి కోరారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్న సంస్థలను గుర్తించి, సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ భవనాలకు తరలించే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ లైబ్రరీ, ఆధునిక సాంకేతిక సదుపాయాలు, కోచింగ్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News