Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ నవవధువు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! వరద నీటిలో చిక్కుకున్న బైకర్ కోసం దేవుడిలా వచ్చారు...!

ఈ నవవధువు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! వరద నీటిలో చిక్కుకున్న బైకర్ కోసం దేవుడిలా వచ్చారు...!

V6 Velugu 1 week ago

హిమాచల్ ప్రదేశ్ లో వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని చున్నీ సాయంతో రక్షించింది నవవధువు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

చంబాలో అకస్మాత్తుగా సంభవించిన వరదలో చిక్కుకున్నాడు ఓ బైకర్. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు పక్కకు కొట్టుకుపోయాడు. అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న ఫ్యామిలీ అతన్ని గమనించి కాపాడారు. నవవధువు సహా మరో ఇద్దరు చున్నీ సాయంతో అతన్ని రక్షిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఘటాష్నిలోని మామ్లా గ్రామానికి చెందిన ఒక బైకర్ వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకుని, ప్రాణాల కోసం పోరాటం చేస్తుండగా అటుగా వెళ్తున్న కుటుంబం అతన్ని రక్షించింది. నవవధువు సహా సహా మరో ఇద్దరు మహిళలు, ఒక దుపట్టాను తాడుగా మార్చి, చిక్కుకుపోయిన బైకర్‌ వైపు విసిరారు.

అతను ఆ చున్నీని పట్టుకోగా... కారులో ఉన్నవారు అతన్ని సురక్షితంగా బయటికి లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా... రకరకాల కామెంట్స్ తో స్పందిస్తున్నారు నెటిజన్స్.

తమిళనాడు ఆలయాల్లో మొబైల్స్ బ్యాన్..ఇవాళ్టి(సెప్టెంబర్1) నుంచే అమల్లోకి

రిస్క్ చేసి అతని ప్రాణాలు కాపాడిన నవవధువుకు హ్యాట్సాఫ్ అని కామెంట్ చేశారు నెటిజన్స్. ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న అతన్ని కాపాడేందుకే దేవుడు ఆ నవవధువు పంపాడేమో అని కామెంట్ చేశాడు మరో నెటిజన్. ఏదేమైనా... సమయస్ఫూర్తి, ఆదుకునే గుణం ఉంటే.. చున్నీతో కూడా మనిషి ప్రాణాలు కాపాడొచ్చని రుజువు చేసింది ఈ నవవధువు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News