Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎపిక్ మూవీకి 90s సిరీస్ కి ఉన్న లింక్ ఇదే..

ఎపిక్ మూవీకి 90s సిరీస్ కి ఉన్న లింక్ ఇదే..

V6 Velugu 6 hrs ago

తాను హీరోగా నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' అనే చిత్రం '90s' సిరీస్'కి సీక్వెల్‌ కాదని, అందులోని పాత్రల నుంచి పుట్టిన కథ అని చెప్పాడు ఆనంద్ దేవరకొండ.

ఆదిత్య హసన్‌ దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి హీరో దేవరకొండ మాట్లాడుతూ ''90s' సిరీస్‌లోని చిన్న కొడుకు విదేశాలకు వెళ్లినప్పుడు జరిగే కథ ఇది. అతను జీవితాన్ని చూసే కోణం ఎలా మారుతుంది.. అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించి, లివిన్ రిలేషన్​లో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఇందులో సహజంగా చూపించారు.

దర్శకుడు ఈ కథ చెప్పగానే విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా వెంటనే కనెక్ట్ అయ్యాను. ఆదిత్య అనే పాత్రలో నన్ను నేను చూసుకున్నా. త్రివిక్రమ్ గారు గతంలో ఓసారి చెప్పినట్టుగా సాధారణ కథను బలంగా చెప్పాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. లివిన్ రిలేషన్‌ అనేది ప్రధాన కథ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా దర్శకుడు ఆదిత్య తెరకెక్కించాడు. చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారికే కాకుండా కుటుంబానికి దూరంగా ఉండే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఇక '90s' సిరీస్‌ ఫ్యామిలీ స్టోరీ అయితే, ఇదొక లవ్ స్టోరీ.

అయినప్పటికీ ఆర్గానిక్‌ హ్యూమర్‌, కుటుంబ బాధ్యతలు, మనసుకు హత్తుకునే ఎమోషన్స్‌ ఇందులోనూ ఉంటాయి.నేను, వైష్ణవి కలిసి నటించిన 'బేబి' ఒక సంచలనమైతే ఇదొక అందమైన ప్రయాణం లాంటిది. ఎలాంటి పోలికలు ఉండవు. ఇక నేను హీరోగా నటించిన 'తక్షకుడు' షూటింగ్ పూర్తయి ఓటీటీలోకి రాబోతోంది. అలాగే ఓ ఇండో కొరియన్‌ మూవీ షూటింగ్ పూర్తి చేశాను' అని చెప్పాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News