Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి :  ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

V6 Velugu 4 days ago

మెదక్​ టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు మానవీయ కోణంలో సేవలందించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య సూచించారు.

బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో మెదక్​ కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు త్వరగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మూడు నెలలకోసారి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్​ నిర్వహించాలని సూచించారు. కమిషన్​ సభ్యుడు లక్ష్మీనారాయణ, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇన్​చార్జి అడిషనల్​ కలెక్టర్ అంబదాసు రాజేశ్వర్, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమాధికారులు సింధు, విజయలక్ష్మి, నీలిమ పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో బాలికల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలను చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News