Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫస్ట్ ఇన్నింగ్స్‎లో వెస్టిండీస్‌ ఆలౌట్‌.. స్కోర్ ఎంతంటే..?

ఫస్ట్ ఇన్నింగ్స్‎లో వెస్టిండీస్‌ ఆలౌట్‌.. స్కోర్ ఎంతంటే..?

V6 Velugu 6 days ago

పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌ మంచి స్కోరు చేసింది. జస్టిన్‌ గ్రీవ్స్‌ (73), రోస్టన్‌ ఛేజ్‌ (70) హాఫ్‌ సెంచరీలు సాధించడంతో..

239/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో రోజు ఆట కొనసాగించిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 344 రన్స్‌కు ఆలౌటైంది. గ్రీవ్స్‌తో ఆరో వికెట్‌కు 96 రన్స్‌ జోడించిన ఛేజ్‌.. కీమర్‌ రోచ్‌ (19)తో ఏడో వికెట్‌కు 35 రన్స్‌ జత చేశాడు.

పాక్‌ బౌలర్ల ధాటికి లోయర్‌ ఆర్డర్‌ చేతులెత్తేసింది. షామేర్‌ జోసెఫ్‌ (8), జోమెల్‌ వారికన్‌ (5 నాటౌట్‌), జైడెన్‌ సీల్స్‌ (8) నిరాశపర్చారు. సాజిద్‌ ఖాన్‌ 4, మహ్మద్‌ అలీ, ఉబైద్‌ షా, అలీ ఉస్మాన్‌ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో 30/0 స్కోరు చేసింది. అజాన్​ (19 బ్యాటింగ్​), ఇమామ్​ (10 బ్యాటింగ్​) క్రీజులో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News