Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ లేకుండానే AI ఏజెంట్ యాక్సెస్.. మెటా నుంచి కొత్త డివైజ్

ఫోన్ లేకుండానే AI ఏజెంట్ యాక్సెస్.. మెటా నుంచి కొత్త డివైజ్

V6 Velugu 2 hrs ago

మెటా(Meta) సంస్థ స్మార్ట్‌ఫోన్‌ అవసరం లేకుండానే నేరుగా పర్సనల్ AI ఏజెంట్‌ను యాక్సెస్ చేసుకునే సరికొత్త అటానమస్ గ్యాడ్జెట్ మ్యూజ్ చార్మ్ (Muse Charm) ను పరిచయం చేసింది.

మెటా కనెక్ట్ ఈవెంట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ ఈ వినూత్నమైన డివైజ్‌ను ప్రకటించారు. అరచేతిలో ఇమిడిపోయే ఒక చిన్న కీచైన్ లాంటి వాయిస్-కంట్రోల్డ్ డివైజ్ ఇది.

ఈ డివైజ్ రన్ అవ్వడానికి ఫోన్‌ గానీ, ఫోన్‌లోని యాప్స్ గానీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఇన్‌బిల్ట్‌గా 5G కనెక్టివిటీ, స్పీకర్లు, మైక్రోఫోన్లు, దాదాపు 2-ఇంచుల OLED టచ్‌స్క్రీన్ ఉంటాయి.

మ్యూజ్ AI ఏజెంట్ అంటే ..

ఇది కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సాధారణ చాట్‌బాట్ కాదు. ఇది ఒక అటానమస్ డిజిటల్ ఏజెంట్. అంటే కస్టమర్ల తరఫున పనులను స్వయంగా పూర్తి చేస్తుంది. ఇమెయిల్‌లు పంపడం, ట్రావెల్ టిక్కెట్లు బుక్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, బిల్లుల గురించి నెగోషియేట్ చేయడం వంటి పనులను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేస్తూ పూర్తి చేస్తుంది. మనుషులతో మాట్లాడినట్లే రియల్-టైమ్ వాయిస్ మోడల్‌తో దీనితో మాట్లాడవచ్చు.

ఆన్‌లైన్ పేమెంట్లు సురక్షితంగా చేయడానికి మెటా Stripe పార్టినర్ షిప్ లో వన్-టైమ్ వర్చువల్ కార్డ్స్‌ను అందిస్తోంది. అలాగే ఇది క్లౌడ్‌లోని ఓ స్పెషల్ వర్చువల్ మెషీన్‌పై రన్ అవుతుంది. దీనికి తోడు సెంటినెల్ అనే ప్రత్యేక ఏజెంట్ సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంది.

ఈ మ్యూజ్ ఏజెంట్‌ను మెటా తన సరికొత్త రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ లోకి కూడా తీసుకువస్తోంది. ఇందుకోసం కెమెరా లేని కేవలం ఆడియో వెర్షన్ రేబాన్ మెటా Audio గ్లాసెస్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ 'మ్యూజ్ చార్మ్' డివైజ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్లోకి తీసుకురావడానికి మెటా ప్లాన్ చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News