Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌షీట్‌కు సిద్ధమవుతున్న SIT.. ముగ్గురు కీలక నేతల పేర్లు చేర్చే ఛాన్స్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌షీట్‌కు సిద్ధమవుతున్న SIT.. ముగ్గురు కీలక నేతల పేర్లు చేర్చే ఛాన్స్

V6 Velugu 5 days ago

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌షీట్‌కు సిద్ధమవుతోంది SIT. ఆగస్టు 15లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఛార్జ్‌షీట్‌లో రాజకీయ నాయకుల పేర్లపై SIT తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

ఛార్జ్ షీట్ లో ముగ్గురు రాజకీయ నేతల పేర్లు చేర్చే అంశంపై న్యాయ సలహాలు తీసుకుంటోంది సిట్. CM రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డుపై SIT కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 600 మందిని విచారించిన SIT.. 600 మంది స్టేట్‌మెంట్ల ఆధారంగా భారీ ఛార్జ్‌షీట్‌కు రంగం సిద్ధం చేస్తోంది.టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కీలక సెక్షన్లను చేర్చే యోచనలో ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో.. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. గత సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు SIT గుర్తించింది.

ఎన్నికల ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై SIT దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ ఛార్జ్ షీట్ సిద్ధమవుతున్న తరుణంలో.. ఛార్జ్‌షీట్‌లో ఎవరెవరి పేర్లు ఉంటాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News