V6 Velugu Posted on Jun 16, 2021
మొబైల్ ఫోన్లు,టీవీలు, కంప్యూటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ రోడ్డు పాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరికి అందిన వాటిని వారు తీసుకెళ్లారు. ఈ ఘటన మహరాష్ట్రలో జరిగింది.
ఉస్మానాబాద్‌లో షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై ఎలక్ట్రానిక్ వస్తువులో వెళ్తున్న ట్రాక్కు బోల్తా కొట్టింది. దీంతో ట్రక్కు నుంచి సుమారు రూ.70 లక్షల విలువచేసే వస్తువులను స్థానిక ప్రజలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

