Dailyhunt
ఫుట్‌బాల్‌కు కేరాఫ్ హైదరాబాద్ .. 16 మెడల్స్ సాధించిన చరిత్ర మనది: సీఎం రేవంత్ రెడ్డి

ఫుట్‌బాల్‌కు కేరాఫ్ హైదరాబాద్ .. 16 మెడల్స్ సాధించిన చరిత్ర మనది: సీఎం రేవంత్ రెడ్డి

V6 Velugu 1 week ago

కప్పుడు ఫుట్ బాల్ కు హైదరాబాద్ సెంటర్ గా ఉండేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1950 నుంచి 1970 మధ్య కాలంలో హైదరాబాద్ పోలీస్ టీమ్ ఏకంగా 16 మెడల్స్ సాధించిందని ఆయన కొనియాడారు.

దేశానికి ఎంతో మంది అగ్రశ్రేణి ప్లేయర్లను అందించిన ఘనత మన నగరానిదేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్ వేదికగా జరిగిన ఆలిండియా పోలీస్ ఫుట్ బాల్ పోటీలు ముగిశాయి. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. కాసేపు పోలీసులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు . ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. 34 టీమ్స్ పాల్గొన్న ఈ మెగా టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ శాఖను అభినందిస్తూ, క్రీడాకారులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు రేవంత్. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒలింపిక్స్‌లో మన దేశం మరిన్ని బంగారు పతకాలు సాధించాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు.

ప్రస్తుతం యువత పబ్ కల్చర్, డ్రగ్స్, సైబర్ నేరాల బారిన పడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేశభక్తికి నిలయమైన పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ కేసులు పెరగడం విచారకరమన్నారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై, యువతపై ఉందన్నారు.

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకురావడం ద్వారా పేద విద్యార్థులకు కూడా ఆయనతో ఆడే అరుదైన అవకాశాన్ని తమ ప్రభుత్వం కల్పించిందని సీఎం చెప్పారు. క్రీడల్లో రాణించే వారికి అండగా ఉంటామన్న రేవంత్.... నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ వంటి క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News