Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాల్లో ఉండగా ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

గాల్లో ఉండగా ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

V6 Velugu 1 week ago

గోవానుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలోని విమానం ఓ ఇంజిన్ లో టెక్నికల్ సమస్య ఏర్పడంతో పైలట్లు అత్యవసరంగా గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.

దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్ పోర్టు నుంచి IndiGo విమానం (6E 2102) ఢిల్లీకి బయల్దేరింది. గాల్లో ఉండగానే విమానం రెండు ఇంజన్లలో ఒకటి ఫెయిల్ అయినట్లు గుర్తించిన పైలట్లు ATC కి సమాచారం ఇచ్చారు. ATC అధికారుల ఆదేశాలతో గోవా ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తల్తెత్తింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 229 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. టెక్నికల్ టీం విచారణ చేపట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News