Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాంధీ భవన్‌ ఎదుట భూ భారతి ఎఫ్‌టీఎస్ ఉద్యోగుల ధర్నా

గాంధీ భవన్‌ ఎదుట భూ భారతి ఎఫ్‌టీఎస్ ఉద్యోగుల ధర్నా

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్, వెలుగు: భూ భారతి ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 636 మంది ఫీల్డ్ టెక్నికల్ స్పెషలిస్ట్ (ఎఫ్‌టీఎస్) ఉద్యోగుల సేవలను యథావిధిగా రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గాంధీ భవన్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు.

చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... మొత్తం 636 మందిలో 290 మందిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News