Dailyhunt
గచ్చిబౌలిలో విషాద ఘటన.. పెళ్లికి ఐదు రోజుల ముందు.. యువ వ్యాపారవేత్త ఆత్మహత్య

గచ్చిబౌలిలో విషాద ఘటన.. పెళ్లికి ఐదు రోజుల ముందు.. యువ వ్యాపారవేత్త ఆత్మహత్య

V6 Velugu 1 week ago

హైదరాబాద్:హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాద ఘటన జరిగింది. పెళ్లికి ఐదు రోజుల ముందు యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గచ్చిబౌలి 'మై హోమ్ మంగళ' అపార్ట్మెంట్లో మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి(30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వెంకట కృష్ణకు ఈ నెల 12 న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

నాని సోదరుడికి వెంకట కృష్ణ చనిపోతున్నట్లు మెసేజ్ చేశాడు. వెంకట కృష్ణ తీవ్ర మానసిక వేదనలో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకొని కత్తితో గొంతు కోసుకున్నాడు. సోదరుడు వచ్చే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులకు వెంకట కృష్ణ సోదరుడు ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News