Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గచ్చిబౌలి-మియాపూర్ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు..శరత్ సిటీ క్యాపిటల్మాల్ దగ్గర  నరకమే..!

గచ్చిబౌలి-మియాపూర్ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు..శరత్ సిటీ క్యాపిటల్మాల్ దగ్గర నరకమే..!

V6 Velugu 4 months ago

హైదరాబాద్​ లో పీక్​ టైంలో రోడ్లపై ప్రయాణించాలంటే చుక్కలు కనపడతాయి. అదే వీకెండ్​ అయితే ట్రాఫిక్​ కష్టాలు మామూలుగా ఉండవు. కిలో మీటరు దూరం ప్రయాణించాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సిదే.

గచ్చిబౌలి-మియాపూర్​ కారిడార్​ ఏరియాలోని శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్ పరిధిలోని ట్రాఫిక్​ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏరియాలో అండర్​ పాస్​.. స్కైవాక్​ నిర్మిచాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

వీకెండ్​.. హాలిడేస్​ రోజుల్లో ఈ ఏరియాకు లక్షల మంది వస్తుంటారు. ఆరు లైన్ల రోడ్​ ఉన్న కొండాపూర్​ శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్​ ఏరియాలో షాపులకు వచ్చే వాహనాల పార్కింగ్​ చేయడం వలన రెండు లైన్లకే పరిమితమవుతుంది. బస్​లు.. ప్రైవేట్​ వాహనాల్లో ప్రయాణికులు ఎక్కి.. దిగేందుకు తగినంత స్పేస్​ లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. వంద మీటర్లు ప్రయాణించాలంటే రెండు గంటల సమయం పడుతుందని వాహనదారులు వాపోతున్నారు.

ట్రాఫిక్​ సమస్యపరిష్కారం కావాలంటే శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్ క్లోజ్​ చేయాలని సైబరాబాద్​ అధికారులు మాల్​ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ ఏరియాలో లక్షలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. గతేడాది మాల్ పార్కింగ్ ప్రాంతాన్ని ప్రధాన రహదారితో కలుపుతూ 22 అడుగుల వెడల్పు గల అండర్‌పాస్‌ను నిర్మించారు. అయినప్పటికీ మాల్ గేట్​ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు.. అక్కడి నుండి రాడిసన్ హోటల్ వరకు ట్రాఫిక్ కు నిరంతరం అంతరాయం కలుగుతుంది.
షాపింగ్​ మాల్​ఎంట్రన్స్​ దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉండటంతో ట్రాఫిక్​ అంతరాయం కలుగుతుంది. రద్దీ సమయాల్లో మాల్ బయట ఉన్న మార్గాన్ని దాటడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.

శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్ దగ్గర ట్రాఫిక్​ పరిస్థితిని గమనించిన అధికారులు..పరిష్కారం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు కొన్ని రోజులుగా పలు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. గతేడాది నిర్మించిన అండర్‌పాస్ ఈ ప్రాంతంలో రద్దీని తగ్గించిందని, కానీ మాల్ వెలుపల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News