Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గండిపేట: ఓటర్ల ధృవ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి

గండిపేట: ఓటర్ల ధృవ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి

V6 Velugu 2 days ago

గండిపేట, వెలుగు: ఓటర్లకు ఇచ్చిన నోటీసులకు సరైన పత్రాలు తీసుకుని వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ, హైదర్షాకోట్‌లో ఏర్పాటు చేసిన ఓటరు జాబితా నమోదు బస్తీ సభలను బుధవారం పరిశీలించారు.

మ్యాపింగ్‌ కాని ఓటర్లతో పాటు తప్పులు ఉన్న ఓటర్లకు నోటీసులు అందించారా? అని ఆరా తీశారు. ఓటర్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభ్యంతరాలు ఉన్న ప్రతి ఓటర్‌కు నోటీసులు అందజేసి సరైన పత్రాలను తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రంగారెడ్డి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News