Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గణేశ్ నిమజ్జనం సెప్టెంబర్ 25..  ఆరోజు ఈ తప్పులు అస్సలు చెయొద్దు..!

గణేశ్ నిమజ్జనం సెప్టెంబర్ 25.. ఆరోజు ఈ తప్పులు అస్సలు చెయొద్దు..!

V6 Velugu 5 hrs ago

హిందూమతంలో గణేశ్ చతుర్ధి నాడు గణేశుని ప్రతిష్ఠించి..తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసిన తరువాత నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుతారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశుని నిమజ్జనం చేస్తారు.

దాంతోపాటు ఇంట్లో ఆనందం, సుఖ శాంతులు వర్ధిల్లాలని ప్రార్ధిస్తారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..

దేశ వ్యాప్తంగా వినాయకుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిమజ్జనం చేస్తున్నారు… ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన అంటే శుక్రవారం రోజున వినాయక నిమజ్జనం జరుగుతుంది..నిమజ్జనం సమయంలో కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు..

వినాయకుడి పూజకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బొజ్జ గణపయ్యను ఏకదంతా అని, వినాయకుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అలాగే ఏ శుభకార్యానికైనా వినాయకుడినీ ముందుగా పూజిస్తారు. గణపయ్య జన్మదినన్నీ పురస్కరించుకుని వినాయక చవితిని ప్రతి సంవత్సరం పది రోజులపాటు జరుపుకుంటారు. ఆ తర్వాత ఆట పాటలతో, తాళమేళాలతో ఆయనను సాగనంపుతారు.. ముఖ్యంగా చెప్పాలంటే గణపయ్య నిమజ్జనానికి ముందుగా దేవుడినీ ఇష్టంగా పూజించాలి.

  • గణపయ్య నిమజ్జనానికి ముందు భక్తి శ్రద్ధలతో గణపతి పూజ చేయాలి. ఎర్రని పూలు, ఎర్రచందనం, గరిక, శెనగ పిండి, తమలపాకు, ధూప దీపం, పాన్ మొదలైన వాటిని వినాయకుడికి సమర్పించాలి. ఈ సామగ్రిని కూడా గణపతితో పాటే నిమజ్జనం చేయాలి. కానీ కొబ్బరికాయను పగలగొట్టకూడదు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వినాయకుడికి హారతినివ్వాలి. అలాగే చతుర్దశి రోజున వినాయకుడు తన ఇంటికి తిరిగి వస్తాడని ప్రజలు నమ్ముతారు.అందుకే వినాయకుడిని ఖాళీ చేతులతో నిమజ్జనం చేయకూడదు.
  • గణపయ్య చేతిలో లడ్డును కూడా ఉంచాలి..గణపయ్య నిమజ్జనం సమయంలో పరిశుభ్రతపై శ్రద్ధ ఉంచాలి. నిమజ్జనం సమయంలో మీ మనసులో చెడు ఆలోచనలు లేకుండా చూసుకోవాలి.
  • గణపతి నిమజ్జనం చేస్తున్నప్పుడు గణేశ్ విగ్రహాన్ని పొరపాటున కూడా ఒక్క ఉదుటున నిమజ్జనం చేయకూడదని గుర్తుంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగానే విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది.
  • ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తుంటే..విగ్రహం కంటే పెద్దదైన ఓ పాత్రను తీసుకోవాలి. ఇందులో విగ్రహాన్ని నెమ్మది నెమ్మదిగా ముంచాలి. ఆ నీళ్లను బయట పాడేయకూడదు. ఏదైనా మొక్క లేదా చెట్టు మొదళ్లో వేయాలి. ఆ నీళ్లు కిందకు అంటే నేలపై రాకుండా చూసుకోవాలి. చేతులు కూడా శుభ్రంగా ఉండాలి.
  • గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయాలి. నిమజ్జనం రోజు పొరపాటున కూడా నల్ల రంగు బట్టలు ధరించకూడదు. నలుపు శనికి సంకేతం.
  • ముఖ్యంగా నిమజ్జనం రోజున మాంసం జోలికి కానీ, మద్యం జోలికి కానీ అసలు వెళ్ళకూడదు.ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ తప్పక గుర్తుంచుకోవాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News