Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గంజాయి మత్తులో దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే.. కొబ్బరిబోండాల కత్తితో దాడి

గంజాయి మత్తులో దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే.. కొబ్బరిబోండాల కత్తితో దాడి

V6 Velugu 3 days ago

హైదరాబాద్ సిటీలో గంజాయి బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి. గంజాయి బ్యాచ్ ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణాలకు పాల్పడుతున్నారు.

గంజాయి మత్తులో ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు..పదునైనా ఆయుధాలతో దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. గంజాయి మత్తులో రౌడీషీటర్లు, పోకిరీలు చేస్తున్న దారుణాలు చూసి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఓ వ్యక్తిని గంజాయి బ్యాచ్ కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపిన సంఘటన హైదరాబాద్ సిటీలో పరిధిలోని సైదాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మంగళవారం (ఆగస్టు4) ఉదయం హైదరాబాద్ సిటీ పరిధిలోని సింగరేణి కాలనీలో జరిగిన దారుణ హత్య స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా నరుకుతుండే అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేకపోయారు.. హత్య చేసి దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. దాడి సమయంలో నిందితుడు గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు.

సైఫాబాద్ పీఎస్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఫసి అహ్మెద్ ఆమెర్ (35) అనే వ్యక్తి పై గంజాయి బ్యాచ్ దారుణంగా కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశారు. కింద పడి పోయిన హమీర్ విచక్షణ రహితంగా దాడి చేశాడు నిందితుడు. హమీర్ పై పలు చోరీ కేసుల్లో ఉన్నాయి. పాతకక్షలు , ఆర్థిక లావాదేవీలు కారణంగానే దాడి చేసినట్లు తెలుస్తోంది. పాత నేరస్థులు దాడులు చేసుకోవడం సహజమే అయినా.. గంజాయి మత్తులో సామాన్య ప్రజలు భయపడేలా పట్టపగలు ఇలాంటి దారుణాలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సంఘటనలను జరగకుండా గంజాయిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News