Dailyhunt
గోవాలో బైకును ఢీకొట్టిన మినీ కూపర్.. 50 మీటర్లు దూసుకెళ్లిన బైక్.. తాజ్ హోటల్ ఎంప్లాయ్ మృతి

గోవాలో బైకును ఢీకొట్టిన మినీ కూపర్.. 50 మీటర్లు దూసుకెళ్లిన బైక్.. తాజ్ హోటల్ ఎంప్లాయ్ మృతి

V6 Velugu 1 week ago

పాపం ఆ యువతి.. హాస్పిటాలిటీ రంగంలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంది. చిన్న గ్రామం నుంచి హోటల్ మేనేజ్మెంట్ చేసి.. తాజ్ లాంటి రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జాబ్ సంపాదించింది.

చిన్న వయసులో అంత పెద్ద హోటల్ లో ఉద్యోగం సంపాదించిందంటే.. భవిష్యత్తులో గొప్పగా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ అంతలోనే ఒక మినీ కూపర్ కారు రూపంలో మృత్యువు కబళించింది. ఆమె కలలు కళ్లలుగా మారాయి. 23 ఏళ్లకే ప్రాణాలు వదిలిన దీక్ష పర్వాడ్కర్ స్టోరీ తీవ్ర విషాదంగా మిగిలింది.

గోవాలోని డోనా పాలాలో జరిగిన ఈ దారుణమైన ప్రమాదం.. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. గోవాలని తాజ్ హోటల్ లో పనిచేస్తున్న దీక్ష పర్వాడ్కర్ .. సోమవారం (ఏప్రిల్ 06) తన కొలీగ్ డి. అరుణ్‌కుమార్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బ్రాండ్ న్యూ మినీ కూపర్ కారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో బైకు 50 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లి పడింది. తీవ్ర గాయాలతో దీక్ష చనిపోగా.. ఆమె కొలీగ్ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆ కారును నడిపిన డేరియస్ డయాస్ (22).. ఆండ్రూ డయస్ అనే ఒక వ్యాపారవేత్త కుమారుడు. అతి వేగమే ప్రమాదానికి కారణమైంది. ఇక్కడ విషయమేంటంటే.. కారు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. డోర్లకు ఉన్న రిబ్బన్ కూడా తీసెయ్యలేదు. అంత కొత్త కారుతో జల్సాలు చేస్తూ.. ఓవర్ స్పీడ్ తో నడుపుతూ ఒక నిండుప్రాణాన్ని బలితీసుకున్నాడు.

పోలీసులు డేరియస్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు నిందితుడినిక కాపాడే ప్రయత్నం చేస్తున్నారని దీక్ష కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కీలక వివరాలు దాచిపెడుతున్నారని, కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

మినీ కూపర్ కారు.. చాలా వేగంతా తాజ్ సర్కిల్ దాటిందని.. అత్యంత వేగంతో వెళ్లి ఢీకొట్టడంతో ఇద్దరూ గాలిలో ఎగిరి పడ్డారని సాక్షులు చెప్పారు. నిందితుడికి ఆల్కహాల్ టెస్టు నెగెటివ్ గా వచ్చిందని పోలీసులు తెలిపారు. బ్లడ్ సాంపుల్ కలెక్ట్ చేసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ మత్తులో ఉన్నాడా అనే కోణంలో దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అతివేగం, నిర్లక్ష్య పూరిత వైఖరితో ఒక నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దిక్షా పర్వాడ్కర్‌కు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు భద్రత అనేవి కేవలం మాటలుగానే మిగిలిపోయాయని.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News