Dailyhunt
గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా :  సోలం రాధాసాగర్

గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా : సోలం రాధాసాగర్

V6 Velugu 5 days ago

గూడూరు, వెలుగు: గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా కట్టాలని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్నాయకుల గూడెం సర్పంచ్ సోలం రాధాసాగర్ తెలిపారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మద్యం వల్ల చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయని, రోజంతా కష్టపడి పని చేసి సాయంత్రం కాగానే బెల్ట్ షాపుల్లో ఖర్చు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారన్నారు.

దీంతో గ్రామసభ ద్వారా పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదంతో గ్రామంలో మద్యపాన నిషేధం విధించినట్లు చెప్పారు. సమావేశంలో దేవేందర్, శ్రీను, రమేశ్, రాంమూర్తి, పాపయ్య, రజిత, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News