Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుడ్ న్యూస్... పోలీస్  ఉద్యోగాలకు  ఆగస్టు 19 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు..

గుడ్ న్యూస్... పోలీస్ ఉద్యోగాలకు ఆగస్టు 19 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు..

V6 Velugu 2 weeks ago

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026 ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి గతవారం TSLPRB నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. పోలీస్, ఎస్పీఎఫ్ (SPF), ఫైర్ సర్వీసెస్, అలాగే జైళ్ల శాఖల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని బోర్డు స్పష్టం చేసింది.

Also Read : రూ.75 వేల స్టైపెండ్తో ఇండియన్ ఆర్మీలో ఇంటర్న్షిప్

ఇక దరఖాస్తు ఫీజు వివరాల విషయానికి వస్తే.. ఎస్సై (SI) పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750 ఉండగా, ఇతరులకు రూ. 1,500గా నిర్ణయించారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు రూ. 600, మిగతా వారికి రూ. 1,200 ఫీజు ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఒకే పీఎంటీ/పీఈటీ (PMT/PET)తో బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడమే కాకుండా, అదనపు దరఖాస్తులపై ఫీజు రాయితీ కూడా ఇస్తున్నారు.

అయితే దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు విధిగా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని, దీనికోసం ప్రత్యేకంగా ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని TSLPRB సూచించింది. మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News