Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గూడ్స్‌ రైలు ఎక్కి ..హైటెన్షన్ వైర్లు పట్టుకున్న యువకుడు..ఫలక్‌నుమా  రైల్వే స్టేషన్‌లో ఘటన

గూడ్స్‌ రైలు ఎక్కి ..హైటెన్షన్ వైర్లు పట్టుకున్న యువకుడు..ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌లో ఘటన

V6 Velugu 1 week ago
  • 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

చార్మినార్‌, వెలుగు: ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ రైలు పైకెక్కి ఓ యువకుడు హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలను పట్టుకున్నాడు.

తీవ్ర గాయాలపాలైన అతడిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి చెందిన కేసరి పవన్‌(23) మల్కాజిగిరి నుంచి గూడ్స్‌ రైలులో శనివారం అర్ధరాత్రి ఫలక్‌నుమాకు వచ్చి అక్కడ రైలు పైకి ఎక్కాడు.

ఒక్కసారిగా హైటెన్షన్​ విద్యుత్​ తీగలను పట్టుకున్నాడు. వెంటనే అధికారులు విద్యుత్​ నిలిపివేసి అతడిని కిందికి దించారు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News