Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హార్మూజ్ నుంచి వెళ్లే నౌకలకు సర్వీస్ ఫీజు.. మిత్రదేశాలకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తామన్న ఇరాన్

హార్మూజ్ నుంచి వెళ్లే నౌకలకు సర్వీస్ ఫీజు.. మిత్రదేశాలకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తామన్న ఇరాన్

V6 Velugu 1 week ago

బీజింగ్: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై సేవా రుసుము (సర్వీస్ ఫీజు) వసూలు చేయనున్నట్టు చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్రేజా రహ్మానీ ఫజ్లీ తెలిపారు.

యుద్ధ సమయంలో తమకు అండగా నిలిచిన మిత్రదేశాలకు మాత్రం ఫీజుల్లో ప్రత్యేక మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు.

అయితే, ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. 60 రోజుల పాటు వాణిజ్య నౌకలు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు.

అయితే, ఆ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి నిబంధనలు అమలులోకి వస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. శనివారం బీజింగ్‌లో జరిగిన వరల్డ్ పీస్ ఫోరమ్​లో ఇరాన్ రాయబారి ఫజ్లీ మాట్లాడుతూ.. ఈ కీలకమైన జలసంధికి సంబంధించి
కొత్త ఏర్పాట్ల కోసం ఒమన్‌ దేశంతో కలిసి తమ దేశం పనిచేస్తోందని తెలిపారు.

'హార్మూజ్ జలసంధి మా ప్రాంతీయ జలాల్లో భాగం. కాబట్టి మేము కచ్చితంగా మేము సర్వీస్​ఫీజును వసూలు చేస్తాము. అయితే, దీనిని టోల్ (పన్ను) లాగా భావించకూడదు' అని ఫజ్లీ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News