Dailyhunt
హార్ముజ్ తెరిచేందుకు,కాల్పుల విరమణకు .. ఇరాన్ ఆ పది షరతులు ఇవే

హార్ముజ్ తెరిచేందుకు,కాల్పుల విరమణకు .. ఇరాన్ ఆ పది షరతులు ఇవే

V6 Velugu 1 week ago

రాన్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించింది.అయితే ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, యుద్దానికి ముగింపు కాదని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలు త్వరలో ప్రారంభమవుతాయని, ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతాయని అధికారులు తెలిపారు.

పలు కీలక షరతులు నెరవేరితేనే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేసింది.

కాల్పుల విరమణ కాలంలో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అయితే ఈ మార్గం గుండా రాకపోకలను తమ సాయుధ దళాలు పర్యవేక్షిస్తాయని, నియంత్రిస్తాయని, నౌకల రాకపోకలు పూర్తిగా అనియంత్రితంగా ఉండవని ఇరాన్ మంత్రి ప్రకటించారు.

ఇరాన్ కాల్పుల విరమణ షరతులు ఇవే..

ఇరాన్ ప్రతిపాదనలో ప్రధానంగా శాశ్వత కాల్పుల విరమణకు ప్రతిఫలంగా తాము ఏమి ఆశిస్తున్నామో వివరించే ఒక సవివరమైన 10-సూత్రాల ప్రణాళికలు అమెరికా ముందుంచింది. ప్రధాన డిమాండ్లు ఇవే..

  • ఇరాక్, లెబనాన్ ,యెమెన్‌లపై యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయడం
  • ఇరాన్‌పై యుద్ధానికి సంపూర్ణ ,శాశ్వత విరమణ ప్రకటించాలి
  • ఈ ప్రాంతంలోని అన్ని దాడులను పూర్తిగా నిలిపివేయాలి
  • హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం
  • హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ ,భద్రతకు కొన్ని నియమాలు, షరతులను ఏర్పాటు చేయడం
  • ఇరాన్‌కు పునర్నిర్మాణ ఖర్చుల పూర్తి పరిహారం చెల్లించాలి
  • ఇరాన్‌పై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయాలి
  • అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ నిధులు,ఆస్తులు విడుదల చేయాలి
  • ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయమని ఇరాన్ స్పష్టీకరణ
  • పై షరతులకు ఆమోదం లభించిన వెంటనే తక్షణ కాల్పుల విరమణ అమలు

అమెరికా కాల్పుల విరమణ ప్రకటన

డొనాల్డ్ ట్రంప్ దీనికి ప్రతిస్పందనగా అమెరికా దాడులకు రెండు వారాల విరామం ప్రకటిస్తూ దీనిని ద్వైపాక్షిక కాల్పుల విరమణ అని చెప్పారు. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఒప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. చర్చలలో పురోగతిని బట్టి చూస్తే ఇరాన్న, అమెరికా మధ్య పెద్ద ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అమెరికా, ఇరాన్ రెండూ ఇప్పుడు వేర్వేరు ప్రతిపాదనలతో పనిచేస్తున్నాయి. ఇవి తుది ఒప్పందానికి ఆధారం కావచ్చు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, కాల్పుల విరమణతో ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయని ట్రంప్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News