Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్: బెగ్గింగ్ మాఫియాపై రెస్క్యూ ఆపరేషన్..వెలుగు కథనానికి స్పందించిన అధికారులు

హైదరాబాద్: బెగ్గింగ్ మాఫియాపై రెస్క్యూ ఆపరేషన్..వెలుగు కథనానికి స్పందించిన అధికారులు

V6 Velugu 2 weeks ago
  • ఐదుగురు తల్లులు, పిల్లల రెస్క్యూ

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న వారిని అడ్డుకునేలా మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, కేర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు, చైల్డ్ లైన్ ఆఫీసర్లు బుధవారం ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

వెలుగు దినపత్రికలో బుధవారం 'సిటీలో బెగ్గింగ్ మాఫియా' అనే కథనం పబ్లిష్​కావడంతో అధికారులు స్పందించి ప్రధాన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

ఈ సందర్భంగా ఐదుగురు తల్లులు, పిల్లలను రెస్క్యూ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి హోమ్స్‌కు తరలించారు. చైల్డ్ లైన్ రెస్క్యూ ఆపరేషన్ కోఆర్డినేటర్ మొద్దయ్య, నర్సింహ, వనిత, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎక్కడైనా పిల్లలు భిక్షాటన చేస్తున్నట్లు కనిపిస్తే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం అందించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News