Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ లో కేఫ్ లపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్... శుభ్రత అనేది వీళ్ళ డిక్ష్నరీలోనే లేదేమో..!

హైదరాబాద్ లో కేఫ్ లపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్... శుభ్రత అనేది వీళ్ళ డిక్ష్నరీలోనే లేదేమో..!

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్ లోని కేఫ్ లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు TG SAFE అధికారులు. బుధవారం ( సెప్టెంబర్ 2 ) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా పలు కేఫ్ లలోని కిచెన్లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు.

ఈ దాడుల్లో చాలా చోట్ల అపరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, నిబంధనల ఉల్లంఘన గుర్తించినట్లు తెలిపారు అధికారులు.

నాంపల్లిలోని కేఫ్ పర్షియాలో అధికారుల తనిఖీల్లో అడుగడుగునా కేఫ్ నిర్వాహకుల డొల్లతనం బయటపడింది. కేఫ్ లోని కిచెన్ లో ఏ మాత్రం శుభ్రత పాటించడం లేదని తెలిపారు అధికారులు. టీ కప్పుల దగ్గర నుంచి వంట సామాన్ల వరకు అన్నీ అపరిశుభ్రంగానే ఉన్నాయని తెలిపారు అధికారులు.

పలు కేఫ్ ల నుండి ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు అధికారులు. సేకరించిన శాంపిల్స్ లో కల్తీ జరిగిందని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. కేఫ్ లు, హోటళ్ల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News