Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్లో అడ్వకేట్ను కారుతో ఢీ కొట్టి చంపింది ఇతనే..!

హైదరాబాద్లో అడ్వకేట్ను కారుతో ఢీ కొట్టి చంపింది ఇతనే..!

V6 Velugu 1 day ago

హైదరాబాద్: అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మొయినుద్దీన్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

హత్యకు వాడిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

స్కార్పియో యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలల క్రితమే కారు అమ్మేసినట్లు పోలీసులకు స్కార్పియో యజమాని చెప్పాడు. కొన్న వాళ్లు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని యజమాని పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులే కారు కొన్నారని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.

కొనుగోలుదారుల అడ్రస్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యకు వాడిన వాహనం, నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు. న్యాయవాది మృతికి కారణమైన నిందితులు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కవాడిగూడకు చెందిన వినయ్ తన కారుతో న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారు ప్రమాదంలో ఇన్వాల్వ్ అయిన నలుగురు వ్యక్తులను కల్వకుర్తి , గోవాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టి వివరాలను నాంపల్లి పోలీసులు వెల్లడించనున్నారు.

►ALSO READ | కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారిపై.. బోల్తా పడి పల్టీలు కొట్టిన కారు !

హైదరాబాద్లో శనివారం తెల్లవారుజామున ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. పక్కా స్కెచ్తో కారుతో ఢీకొట్టి హతమార్చారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఖాజా మొహిజుద్దీన్ (63) వృత్తిరీత్యా అడ్వకేట్. తన మామ హాస్పిటల్లో ఉండడంతో శనివారం ఉదయం ఆయనను చూసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి.. రోడ్డుపై పార్క్ చేసిన తన కారు డోర్ తీస్తుండగా.. నంబర్ ప్లేట్ లేని ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది.

దీంతో మొహిజుద్దీన్ ఎగిరి కొంతదూరంలో పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సదరు కారులోని దుండగులు వాహనంతో సహా అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఖాజా మొహిజుద్దీన్ను కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ట్రీట్​మెంట్​ పొందుతూ మృతి చెందారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News