Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో  గణేష్ ఉత్సవాలు.. డీజేలు పూర్తిగా బ్యాన్ చేయాలి

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు.. డీజేలు పూర్తిగా బ్యాన్ చేయాలి

V6 Velugu 5 days ago

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ , ట్రాఫిక్ జాయింట్ సీపీ జాయింట్ మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు.

ఈసారి గణేష్ ఉత్సవాలను 6 విడతలుగా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ధూల్‌పేట్, సిటీ అవుట్‌స్కార్ట్స్ నుంచి విగ్రహాల రవాణా, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిర్వాహకులు ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తుకు మించిన విగ్రహాలకు డీజేలను పూర్తిగా నివారించాలని, అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఖైరతాబాద్ గణేష్ నిమర్జన సమన్వయం చాలా ముఖ్యమని, ట్యాంక్‌బండ్పై ఆఖరి రోజు క్రెయిన్ల ఏర్పాట్లు పక్కాగా ఉంటాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే నిమర్జన రోజున రద్దీ 30 శాతం పెరిగే అవకాశం ఉన్నందున, బందోబస్తును రీడిజైన్ చేసినట్లు చెప్పారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీతో కలిసి ప్రశాంతంగా పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు.

మరోవైపు ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ.. మంగళహాట్, జల్‌పల్లి తదితర ప్రాంతాల్లో విగ్రహాల విక్రయాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. విగ్రహాల ఆగమనాన్ని పీక్ అవర్స్‌లో కాకుండా రాత్రి 10 గంటల తర్వాత చేపట్టాలని సూచించారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ నిమర్జన మార్గాల్లో ఆర్టీసీ సమన్వయంతో ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News