Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో రోచ్‌ డిజిటల్ టెక్ హబ్‌

హైదరాబాద్‌లో రోచ్‌ డిజిటల్ టెక్ హబ్‌

V6 Velugu 3 weeks ago

హైదరాబాద్‌, వెలుగు: గ్లోబల్ హెల్త్‌కేర్ సంస్థ రోచ్ భారతదేశంలో తన రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

వచ్చే ఏడాది జనవరి--మార్చి క్వార్టర్‌లో ఇది ప్రారంభం కానుంది. బయోస్టాటిస్టిక్స్, ఈఆర్‌పీ, మెడికల్ సేఫ్టీ వంటి విభాగాలలో అత్యాధునిక డిజిటల్ పరిష్కారాలను, ఐటీ సేవలను అభివృద్ధి చేయడం ఈ హబ్ ముఖ్య ఉద్దేశం.

ఇప్పటికే పుణెలో రోచ్‌కు ఒక టెక్ హబ్ ఉండగా, తాజా పెట్టుబడితో భారత హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌లో తన భాగస్వామ్యాన్ని కంపెనీ మరింత బలోపేతం చేయనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News