Dailyhunt
హుజూరాబాద్ బంద్ విజయవంతం

హుజూరాబాద్ బంద్ విజయవంతం

V6 Velugu 3 weeks ago
  • బంద్‌కు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు

హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది.

పట్టణంలోని వ్యాపార, వాణిజ్య రంగాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

దేశానికి నాణ్యమైన విత్తనాలను అందించే ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో రాజకీయాలకతీతంగా అందరూ కలిసి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News