Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ICC టెస్ట్‌ ర్యాంకింగ్స్: నాలుగో స్థానంలో కోహ్లీ

ICC టెస్ట్‌ ర్యాంకింగ్స్: నాలుగో స్థానంలో కోహ్లీ

V6 Velugu 5 years ago

V6 Velugu Posted on Jun 16, 2021

ఐసీసీ ఇవాళ(బుధవారం) టెస్ట్ ర్యాంకిగ్స్ ను విడుదల చేసింది.ఈ ర్యాంకిగ్స్ లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని నాలుగో ర్యాంక్‌ ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం 814 రేటింగ్‌ పాయింట్లు కలిగిన కోహ్లీ.. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియనిషిప్‌(WC) ఫైనల్‌, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌ ఆడాల్సిన క్రమంలో టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి ప్లేస్ లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ICC ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి తిరిగి మొదటి స్థానంలో నిలిచాడు.

ఆసీస్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ మూడో ర్యాంకులో, ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియా డాషింగ్‌ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌ (797), రోహిత్‌ శర్మ (797) ఆరో స్థానంలో నిలిచారు.

బౌలింగ్‌ లో.. ప్యాట్‌ కమిన్స్‌ (908), రవిచంద్రన్‌ అశ్విన్‌ (850), టిమ్‌ సౌథీ (830) టాప్‌-3 బౌలర్లుగా నిలిచారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ 307 రేటింగ్‌ పాయింట్లతో 64వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌ రౌండర్ల లిస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు అశ్విన్‌ 2, జడేజా 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News