Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కోచ్‌గా ఫ్లెమింగ్‌

ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కోచ్‌గా ఫ్లెమింగ్‌

V6 Velugu 2 weeks ago

లండన్‌: న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌.. ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమితులయ్యాడు.

బ్రెండన్‌ మెకల్లమ్‌ స్థానంలో 53 ఏళ్ల ఫ్లెమింగ్ బాధ్యతలు స్వీకరిస్తాడని ఈసీబీ అధికారికంగా వెల్లడించింది.

న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ ఓటమి తర్వాత మెకల్లమ్‌ టెస్ట్‌ కోచింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే వైట్‌బాల్‌ జట్లకు మాత్రం కోచ్‌గా కొనసాగుతాడు. ఫ్యామిలీతో కొంత సమయం గడిపిన తర్వాత ఫ్లెమింగ్‌ ఇంగ్లండ్‌కు రానున్నాడు.

పాకిస్తాన్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు మార్కస్‌ ట్రెస్కోథిక్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జరిగే సౌతాఫ్రికా టూర్‌కు ఫ్లెమింగ్‌ బాధ్యతలు తీసుకుంటాడు. కెప్టెన్సీకి రిటైర్మెంట్‌ ప్రకటించిన బెన్‌ స్టోక్స్‌ ప్లేస్‌లో జో రూట్‌ సారథిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం లేకపోయినప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఫ్లెమింగ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News