Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంజినీరింగ్ చేశారా ? డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. JRF పోస్టులకి వెంటనే అప్లయ్ చేసుకోండి!

ఇంజినీరింగ్ చేశారా ? డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. JRF పోస్టులకి వెంటనే అప్లయ్ చేసుకోండి!

V6 Velugu 1 hr ago

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ)కు చెందిన వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (వీఆర్ డీఈ) విభాగం జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజినీరింగ్).

మొత్తం ఖాళీలు: 5.

ఎలిజిబిలిటీ: మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ డివిజన్‌తో బీఈ లేదా బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ తప్పనిసరి లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ డివిజన్‌తో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 27.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: అక్టోబర్ 6.

రాత పరీక్ష & ఇంటర్వ్యూ: అక్టోబర్ 6.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ drdo.gov.inను సందర్శించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News