Dailyhunt
IPL 2026: ధోనీ లోటును భర్తీ చేయడం అంత ఈజీ కాదు.. శాంసన్ ఫామ్‌పై జహీర్ కీలక వ్యాఖ్యలు

IPL 2026: ధోనీ లోటును భర్తీ చేయడం అంత ఈజీ కాదు.. శాంసన్ ఫామ్‌పై జహీర్ కీలక వ్యాఖ్యలు

V6 Velugu 1 week ago

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుస ఓటములతో సతమతమవుతోంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ ట్రేడ్ ద్వారా CSKలో చేరిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, మొదటి రెండు మ్యాచ్‌లలో వరుసగా 6, 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

దీంతో సంజూ శాంసన్ ప్రస్తుత ఫామ్ గురించి టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జహీర్ ఖాన్ ఏమన్నారంటే?:
క్రిక్‌బజ్ చర్చలో పాల్గొన్న జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. CSK ప్రదర్శన శాంసన్ ఫామ్‌పై ఆధారపడి ఉంది. వరల్డ్ కప్‌లో అతడి ప్రదర్శన చూశాక భారీ అంచనాలు పెరిగాయి.. కానీ సంజూ ఎల్లో జెర్సీ ధరించాక బంగారంలా మెరుస్తాడని అందరూ భావించారు.. అతను ఫామ్‌లోకి వస్తే, శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రే లాంటి వారితో కలిసి CSK మరో స్థాయికి చేరుతుందని పేర్కొన్నాడు. ఇక ధోనీ లేకపోవడం జట్టుకి పెద్ద లోటు.. రుతురాజ్ గైక్వాడ్‌కు ఇది నిజమైన పరీక్ష.. ఒక విజయవంతమైన ఫ్రాంచైజీని నడిపిస్తూ, ధోనీ లేని లోటును భర్తీ చేయడం అంత సులభం కాదు.. ప్రస్తుతం జట్టు ట్రాన్సిషన్ (మార్పు) దశలో ఉందని జహీర్ వెల్లడించారు.

►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో.. SRH ఫస్ట్ బ్యాటింగ్

నేడు RCBతో పోరు:
వరుసగా రెండు ఓటములు (రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌పై) ఎదుర్కొన్న చెన్నై, ఈరోజు (2026, ఏప్రిల్ 5న ) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది.
ముఖ్యంగా చెన్నై టీమ్ బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా విఫలమవుతుండటంతో పాటు గాయాల సమస్య కూడా జట్టును వేధిస్తోంది. మరోవైపు, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. గత మ్యాచ్‌లో అతను అజేయ అర్ధ సెంచరీతో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. అయితే ఎంఎస్ ధోనీ గాయం కారణంగా మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా, సంజు శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. నేటి మ్యాచ్‌లోనైనా శాంసన్ తన బ్యాట్‌కు పని చెప్పి CSKను గెలిపిస్తాడేమో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News