Dailyhunt
IPL 2026: సన్ రైజర్స్‎కు షమీ షాక్.. 4 ఓవర్లలోనే అభి, హెడ్, కిషాన్ ముగ్గురు ఔట్

IPL 2026: సన్ రైజర్స్‎కు షమీ షాక్.. 4 ఓవర్లలోనే అభి, హెడ్, కిషాన్ ముగ్గురు ఔట్

V6 Velugu 1 week ago

పీఎల్ 19లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‎తో జరుగుతోన్న మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ కుప్పకూలింది. నాలుగు ఓవర్లలోనే ఎస్ఆర్‎హెచ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

లక్నో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్‎తో సన్ రైజర్స్‎ను దెబ్బ కొట్టాడు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్లలోనే స్టార్ ప్లేయర్ అభిషేక్‎ను డకౌట్ చేసి ఎస్ఆర్‎హెచ్‎కు ఝలక్ ఇచ్చాడు. మూడు ఓవర్లో మళ్లీ బౌలింగ్‎కు వచ్చిన షమీ ఈ సారి విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్‎ (7)ను పెవిలియన్‎కు పంపాడు. దీంతో హైదరాబాద్ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ జట్టును ఆదుకుంటాడనుకునే లోపే ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో హైదరాబాద్ కెప్టెన్‎ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కేవలం ఒక్క రన్ మాత్రమే చేసి నిరాశగా పెవిలియన్ చేరాడు హైదరాబాద్ కెప్టెన్. ప్రస్తుతం క్రీజులో లివింగ్ స్టోన్ (13), హెన్రిచ్ క్లాసెన్ (3) ఉన్నారు. ఏడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.

►ALSO READ | IPL 2026: ధోనీ లోటును భర్తీ చేయడం అంత ఈజీ కాదు.. శాంసన్ ఫామ్‌పై జహీర్ కీలక వ్యాఖ్యలు

ఈ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసే హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయాలని చూస్తుండగా, లక్నో బౌలర్లు ప్రారంభంలోనే వికెట్లు తీసి మ్యాచ్పి పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిచ్ పరిస్థితులు మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా మార్చే ఛాన్స్ ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News