Dailyhunt
IPL 2026: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్

IPL 2026: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్

V6 Velugu 1 week ago

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గౌహతిలోని బర్సపరా స్టేడియంలో ఎట్టకేలకు టాస్ పడింది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.

ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురవడంతో మైదానం చాలా సేపు కవర్లతో కప్పబడి ఉంది. దీనివల్ల ఆరంభంలో పిచ్‌పై తేమ ఉండటంతో పేస్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. రాత్రి గడిచేకొద్దీ మంచు ప్రభావం పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే హార్దిక్ పాండ్యా తెలివిగా ఛేజింగ్‌ను ఎంచుకున్నాడు.

ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం.. పిచ్ చాలా సేపు కవర్ల కింద ఉంది, వర్షం పడే మ్యాచ్‌ల్లో రెండోసారి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ మేలు.. ఇది సీజన్ ఆరంభం మాత్రమే, కొన్ని తప్పులు జరగడం సహజం.. మొదటి రెండు వారాల్లోనే ఐపీఎల్ గెలవలేం.. ఈ మ్యాచ్‌తో నేను, ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులోకి వచ్చామని పేర్కొన్నాడు.

రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ తీసుకునే వాళ్లమని పేర్కొన్నాడు. పిచ్ పొడిగా ఉంటుందనుకున్నాం కానీ భారీ వర్షం పడింది.. గత రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడిని మా కుర్రాళ్లు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.. మేము పాత టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నామని వెల్లడించారు.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, AM ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News