Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జార్ఖండ్లో పేపర్ లీక్‎పై భారీ నిరసన.. ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్

జార్ఖండ్లో పేపర్ లీక్‎పై భారీ నిరసన.. ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్

V6 Velugu 1 week ago

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ పబ్లిక్​ సర్వీస్ కమిషన్ ​(జేపీఎస్సీ) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అక్కడి విద్యార్థులు ఆందోళనకు దిగారు.

పరీక్షను రద్దు చేయాలని, పేపర్ లీకేజీలపై దర్యాప్తు జరపాలని, రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రాంచీలో విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది.

జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో స్టూడెంట్ లీడర్ ​దేవేంద్ర నాథ్ మహతో ఆదివారం నుంచి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించాడు. సీఎం హేమంత్ సోరెన్‌కు సమర్పించిన డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశాడు. కాగా, ఈ ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మద్దతు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News