Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేఎన్టీయూ రిజిస్ట్రార్ బదిలీకి కుట్ర

జేఎన్టీయూ రిజిస్ట్రార్ బదిలీకి కుట్ర

V6 Velugu 3 weeks ago

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూ రిజిస్ట్రార్ జయలక్ష్మిని ఆ పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని బీజేవైఎం, ఏబీవీపీ, బీఆర్​ఎస్​వీ నాయకులు ఆరోపించారు.

సోమవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో రిజిస్ట్రార్​కు మద్దతుగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఉయ్​ స్టాండ్​ విత్​ వీసీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు.

నాయకులు చల్ల రామకృష్ణారెడ్డి, పితాని సందీప్ మాట్లాడుతూ.. దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత వర్సిటీ వీసీ ఒక బీసీ మహిళను రిజిస్ట్రార్​గా నియమిస్తే.. జీర్ణించుకోలేని కొందరు ఆమెను బదిలీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నాయకులు జయరాం, సాయిరాం, మనీష్​, కారుణ్య, రామ్​, ఉదయ్​, రాజ్​కుమార్​ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News