- పాల్గొన్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య
న్యూఢిల్లీ, వెలుగు: స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల బలోపేతంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.
జవహర్ వ్యాపార భవన్ లోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కార్యాలయం లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్, ఆసిఫ్అలీ కీలక అంశాలను ఈ మీటింగ్ లో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్మన్ ఎస్ రాధా, మెంబర్స్ ఆల్కా మిట్టల్ బాల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.

