Dailyhunt
Jobs : గోవా షిప్ యార్డ్ లో ఉద్యోగాలు : BE, B.Tech పాస్ అయ్యి ఉంటే చాలు..!

Jobs : గోవా షిప్ యార్డ్ లో ఉద్యోగాలు : BE, B.Tech పాస్ అయ్యి ఉంటే చాలు..!

V6 Velugu 1 week ago

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్, బీఈ/ బి.టెక్ అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 2న ప్రారంభమై ఏప్రిల్ 22న ముగుస్తుంది.

పోస్ట్ పేరు: మేనేజర్, డిప్యూటీ మేనేజర్.

మొత్తం ఖాళీలు: 25.

విభాగాల వారీగా ఖాళీలు: మేనేజర్- వెపన్స్ 01, మెయిన్ ప్రొపల్షన్ & షాఫ్టింగ్/ ఆక్సిలరీ 1,

డిప్యూటీ మేనేజర్- మెయిన్ ప్రొపల్షన్ & షాఫ్టింగ్/ ఆక్సిలరీ 1, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ పవర్ 4, సిగ్నల్ & కమ్యూనికేషన్స్ 4, వెపన్స్ 1, పైపింగ్ 2, హెచ్​వీఏసీఆర్ 2, హల్/ హల్ అవుట్‌ఫిట్ 7, సేఫ్టీ 2.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

గరిష్ట వయోపరిమితి: 39 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్​:ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం:ఏప్రిల్ 2.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు లేదు.

లాస్ట్ డేట్:ఏప్రిల్ 22.

సెలెక్షన్ ప్రాసెస్: అర్హత ఆధారంగా అప్లికేషన్ షార్ట్​లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ goashipyard.inను సందర్శించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News