Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జ్యోతిష్యం:  సెప్టెంబర్.. కన్యారాశి ఫలితాలు.. ఆదాయం పెరుగుతుంది.. ఈ రాశి వారికి దశ తిరిగినట్లే

జ్యోతిష్యం: సెప్టెంబర్.. కన్యారాశి ఫలితాలు.. ఆదాయం పెరుగుతుంది.. ఈ రాశి వారికి దశ తిరిగినట్లే

V6 Velugu 1 week ago

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల (సెప్టెంబర్​ 2026)లో కన్యారాశివారికి గ్రహాలు.. వాటిస్థానాల ఆధారంగా అనుకున్న పనులు నెరవేరుతాయని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది.

గ్రహాల సంచారం ఈ రాశికి అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

సెప్టెంబర్​ లో గ్రహాల కదలికల వివరాలు

  • సెప్టెంబర్ 2: తులా రాశిలోకి శుక్రుడు
  • సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు
  • సెప్టెంబర్ 17: కన్యారాశిలోకి సూర్యుడు
  • సెప్టెంబర్ 18: కర్కాటక రాశిలోకి కుజుడు
  • సెప్టెంబర్ 26: తులా రాశిలోకి బుధుడు

కన్యా రాశి వారికి సెప్టెంబరు నెల గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇల్లు కోసం ఎదరుచూసే వారికి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సెప్టెంబర్ 7న బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో బుధ, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగం ప్రభావంతో ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

సెప్టెంబర్​ 2026 లో కన్యారాశి వారికి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు సాగుతారని పండితులు చెబుతున్నారు. సంతానం విద్యా విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిరు ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

సెప్టెంబర్​ నెలలో ఈ రాశి వారికి దైవం బలం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఉన్న ఆస్తి వివావాదాలు పరిష్కారమవుతాయి.

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కష్టానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారస్తులు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి పొందుతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వవద్దని పండితులు చెబుతున్నారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

పరిహారాలు : బుధవారం గణపతి హోమం, ఏకాదశి, శనివారాలు విష్ణుసహస్రనామ పారాయణం

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News